బీసీలకు బీసీ ప్రధాని ద్రోహం
- మోదీ మూడుసార్లు ప్రధాని అయినా న్యాయం చేయలేదు
- ప్రభుత్వ సలహాదారు వీహెచ్
కామారెడ్డి, జూన్ 2 (విజయక్రాంతి): ప్రధాని మోదీ బీసీ అయి ఉండి బీసీలకు ద్రోహం చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ బీసీ సంక్షేమ శాఖ సలహాదారు వీ హనుమంతరావు అన్నారు. మంగళవారం కామారెడ్డిలో మీడియాతో మాట్లాడారు. మూడుసార్లు దేశానికి ప్రధానమంత్రి అయిన మోదీ బీసీ అయి కూడా బీసీలకు న్యాయం చేయడం లేదన్నారు. ‘అగ్రకులానికి చెందిన రాహుల్‌గాంధీ రేవంత్‌రెడ్డి గురించి ఆలోచిస్తున్నా రు. దేశవ్యాప్తంగా కాశ్మీ ర్ నుంచి కన్యాకుమారి వరకు భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ 4500 కిలోమీటర్లు పాదయాత్ర చేశారన్నారు.
పాదయా త్రలో ఎస్సీ, ఎస్టీల కన్నా వీధిలో ఎక్కువగా ఉన్నారని, బీసీలు తీవ్రంగా నష్టపోతున్నారని రాహుల్‌గాంధీ గమనించారన్నారు. అందుకే బీసీల లెక్క తేల్చాలని, దేశవ్యాప్తంగా కులగణన జరగాలని పట్టుబట్టార న్నారు. జనాభా ప్రతిపాదికన బీసీల కు న్యాయం జరగాలని కోరడంతో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం జనగణన చెప్పడానికి నిర్ణయించిందన్నారు. తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి కేబినెట్ సమావేశంలో కులగణన చేయాలని నిర్ణయించి 150 కోట్లు కేటాయించారని చెప్పారు. సీబీఐ, ఈడీ, ఈసీలను కేంద్రం గుప్పిట్లో పెట్టుకుని ప్రభుత్వాలను పడగొట్టేందుకు వాటిని వాడుకుం టున్నదని విమర్శించారు. ప్రస్తుతం తెలంగాణలో సర్ ద్వారా ఓట్ల లెక్క తేల్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నదని, ప్రతి ఒక్కరు సర్‌లో భాగస్వామ్యం కావాలన్నారు. తమ వివరాలను నమోదు చేసుకోవాలన్నారు.






