అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం
సర్పంచ్ కావటి సుధాకర్
జనగామ, జూన్ 2 (విజయక్రాంతి) : ఐదేళ్ల పాలనలో అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని సర్పంచ్ కావటి సుధాకర్ అన్నారు. మంగళవారం మండలంలోని అబ్దుల్ నాగారం గ్రామంలో సర్పంచ్ తో పాటు వార్డు మెంబర్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి కొబ్బరికాయ కొట్టి ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రజా పాలనలో ప్రజా ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి, జనగామ డిసిసి అధ్యక్షులు ధన్వంతి సహకారంతో గ్రామంలోని లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని హామీ ఇచ్చారు. పేదవారికి ఇల్లు కట్టుకోవడం ఒక కళ అని ఆకల నెరవేర్చే బాధ్యత ఒక సర్పంచ్ గా నాపై ఉందన్నారు.
రానున్న విడుదలలో గ్రామానికి అధిక సంఖ్యలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయించి ఏ ఒక్కరు గుడిసెలలో నివసించకుండా ఇందిరమ్మ ఇల్లు కల నెరవేర్చే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి భూక్య లింగం, ఇందిరమ్మ ఇండ్లు కమిటీ మెంబర్స్, వార్డు మెంబర్లు గాలయ్య, బండి సాంబరాజు, భాష బోయిన సురేష్, తదితరులు పాల్గొన్నారు.






