3 June, 2026 | 12:48 AM

ఆంధ్రుల కుట్రలు తెలంగాణలో మళ్లీ మొదలయ్యాయి..

03-06-2026 12:02 AM

జనగామ ఎమ్మెల్యే  రాజేశ్వర్ రెడ్డి  

జనగామ, జూన్ 2 (విజయక్రాంతి): జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్క రించుకుని జనగామ జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన కా ర్యక్రమంలో ముఖ్య అతిథిగా జనగామ ఎ మ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముందుగా తెలంగా ణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. జూన్ 2 అంటే తెలంగా ణ ప్రజలందరికీ స్వాతంత్య్రం వచ్చిన రోజు అని అన్నారు.

ఆ రోజున ప్రతి కుటుం బం లో, ప్రతి వ్యక్తిలో ఆనందం ఉప్పొంగింది. పార్టీ, మత భేదాలు లేకుండా తెలంగాణ సాధన ఆనందాన్ని ప్రజ లందరూ పంచుకున్నారని చెప్పారు. 70 ఏళ్లుగా తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని గత 10 ఏళ్లలో గణనీయంగా సరిచేశాం. నీళ్లు, నిధులు, నియా మకాలు అనే నినాదంతో ఉద్యమాన్ని ప్రా రంభించి, ఒంటరిగా మొదలైన పోరాటాన్ని లక్షలాది మందిని వెంట నడిపిస్తూ, శాంతియుతంగా ఉద్యమం నిర్వహించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వీరుడు కేసీఆర్ అని కొనియాడారు.

ప్రపంచంలోనే అరుదైన రీతిలో గాంధీజీ సూచించిన అహింసా మార్గంలో ఉద్యమాన్ని విజయవంతం చేశా రని పేర్కొన్నారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలన గురించి ఈరోజు గ్రామం ఏదైనా, వాడ ఏదైనా, పార్టీకి అతీతంగా ప్రజలు ఒక్కటే చెబుతున్నారు. మేం మోసపోయాం& మాయమాటలకు ఓటు వేషమని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.

జూన్ 2న తొలిసారి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి నప్పటికీ, తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని తొలగించి ఇతర రూపాన్ని పెట్టడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో 30 మెడికల్ కాలేజీలు, అధునాతన ఆసుపత్రులు నిర్మించామని, వరంగల్ లో దేశంలోనే అతిపెద్ద ఆసశాతం పూర్తయ్యినా మిగిలిన నిధులు ఇవ్వకుండా ఆపేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.