75,054 ఎప్‌సెట్ సీట్లు కేటాయింపు
05-08-2026 12:00 AM
హైదరాబాద్, ఆగస్టు 4 (విజయక్రాంతి): ఎప్‌సెట్ తుది విడత సీట్లను విద్యార్థులకు మంగళవారం కేటాయించారు. మొత్తం 94,156 సీట్లకుగానూ 75,054 సీట్లు ఇప్పటి వరకు కేటాయించారు. మొత్తం 176 కాలేజీల్లో 94,156 సీట్లకుగానూ 75,054 (80 శాతం) భర్తీ కాగా, ఇంకా 19,102 సీట్లు మిగిలాయి. రెండు ప్రైవేట్ యూనివర్సిటీల్లో 1386 సీట్లకుగానూ 1372 (99 శాతం) సీట్లు భర్తీ అయ్యాయి. ఈ నెల 7వ తేదీ వరకు ఫీజు చెల్లించి సీట్లు పొందిన అభ్యర్థులు ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలని అధికారులు సూచించారు.






