21 April, 2026 | 6:07 PM

Breaking News

నా భూమికి రక్షణ కల్పించండి   •   గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం : ప్రిన్సిపాల్ డాక్టర్ స్నేహలత   •   బడుగు బలహీన వర్గాల సమగ్ర ఆర్థిక అభివృద్ధియే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే బిఎల్ఆర్   •   అకాల వర్షం ఈదురుగాలతో విద్యుత్ శాఖకు నష్టం   •   బస్సు ఢీకొని వ్యక్తి మృతి   •   గోవులను నదులతో సమానంగా గౌరవించాలి   •   విద్యార్థులు లక్ష్యసాధనకు కృషి చేయాలి - కలెక్టర్ చాహత్ బాజ్ పాయి   •   కొడుకుతో కలిసి కట్టుకున్నోడినే కడతేర్చిన భార్య   •   రేవంత్ స్థాయి ఏంటో ప్రజలకు అర్థమైంది.. కాంగ్రెస్ మళ్లీ గెలవదు!   •   ప్రజల దాహార్థి తీర్చడమే లక్ష్యం: సర్పంచ్ హీరాలాల్   •  

డా. బీ.ఆర్ అంబేద్కర్ ఎక్సలేన్స్ 2026 అవార్డును అందుకున్న అచ్చమ్మకుంట తండా కుర్రాడు నేనావత్ అనిల్ కుమార్

21-04-2026 04:38 PM

దేవరకొండ,(విజయక్రాంతి): డా. బీ.ఆర్ అంబేద్కర్ ఎక్సలేన్స్ 2026 అవార్డును అంతో సంతోషంగా ఉంటుందని నేనావత్ అనిల్ కుమార్ అన్నారు. నల్గొండ జిల్లా దేవరకొండ మండలం అచ్చమ్మకుంట తండా గ్రామ పంచాయతీకి చెందిన నేనావత్ అనిల్ కుమార్ కి ఆదివారం హైదరాబాద్ చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయగాన సభలో ముఖ్య అతిధులు యాక్టర్స్ డాక్టర్.బాలిరెడ్డి పృద్వి రాజ్, తెలుగు హీరో రాంకీ చేతుల మీదుగా డా.బి.ఆర్ అంబేద్కర్ ఎక్సలెన్స్-2026 అవార్డును  అందుకున్నారు.

ఈ సందర్భంగా పృద్విరాజ్, హీరో రాంకీ మాట్లాడుతూ.... గ్లోబల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ రంగాలలో విశేష సేవ కార్యక్రమాల నందు అనిల్ కృషి చేశారని, డావ్ ఆర్ఫనేజ్ ట్రస్ట్ మేనేజర్ డైరెక్టర్ గా చేస్తూ సుమారు 20 మంది తల్లిదండ్రులు లేని పిల్లలను, రోడ్ సైడ్ ఉన్న పిల్లలను అన్ని విధాలుగా ముందుండి, వారికి చదువుపిస్తున్నారని,చిన్న తనంలోనే గొప్ప గొప్ప కార్యక్రమాలకు అనిల్ కుమార్ శ్రీకారం చుట్టారని అన్నారు. ఎల్లప్పుడూ ఇలానే సహాయ సహకారాలు చేస్తూ ముందుకు సాగాలని అనిల్ కుమార్ ని కొనియాడారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ.... నేను హిమగిరినగర్ కాలనీ, రాజేంద్రనగర్ లోని డావ్ ఆర్ఫనేజ్ ట్రస్ లో గత మూడు సంవత్సరాలుగా మేనేజింగ్ డైరెక్టర్ గా చేస్తున్నాను.

ట్రస్ట్ చైర్మన్ అయిన రామాపురం మల్లేష్, ఈస్టర్ రాణి ఈ ట్రస్ట్ ను స్థాపించారు. ఈ ట్రస్ట్ లో సుమారు 20 మంది తల్లిదండ్రులు లేని అనాధ పిల్లలు ఉన్నారు. మేము సంపాదించ్చే రూపాయిలో సగ భాగం పిల్లల ఖర్చులకు పెడుతున్నామన్నారు. కొన్ని సందర్భాలలో మా ఇల్లు గడవలేని పరిస్థితులలో కూడా అప్పులు చేసి మరీ అన్ని మేమై పిల్లలను చూసుకుంటూ దగ్గరలో ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నామని,విద్యతో వారికి ఒక ఉన్నత స్థానాలకు తీసుకురావలని మా ట్రస్ట్ చిన్న ప్రయత్నం అని,వారు ఉన్నత స్థాయిలో చేరుకొని, ఇలాంటి మరెన్నో సేవలు  అందిస్తానని అన్నారు.త్వరలో ఒక ఫౌండేషన్ ఏర్పాటు ప్రతి ఒక్క పేద వారికి ఎంతోకొంత సహాయం చేయాలన్నదే నా ముఖ్య ఉద్దేశం పేర్కొన్నారు.