21 April, 2026 | 5:52 PM

Breaking News

బడుగు బలహీన వర్గాల సమగ్ర ఆర్థిక అభివృద్ధియే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే బిఎల్ఆర్   •   అకాల వర్షం ఈదురుగాలతో విద్యుత్ శాఖకు నష్టం   •   బస్సు ఢీకొని వ్యక్తి మృతి   •   గోవులను నదులతో సమానంగా గౌరవించాలి   •   విద్యార్థులు లక్ష్యసాధనకు కృషి చేయాలి - కలెక్టర్ చాహత్ బాజ్ పాయి   •   కొడుకుతో కలిసి కట్టుకున్నోడినే కడతేర్చిన భార్య   •   రేవంత్ స్థాయి ఏంటో ప్రజలకు అర్థమైంది.. కాంగ్రెస్ మళ్లీ గెలవదు!   •   ప్రజల దాహార్థి తీర్చడమే లక్ష్యం: సర్పంచ్ హీరాలాల్   •   మంచి చేయాలని సంకల్పం మనసులో ఉండాలి   •   డా. బీ.ఆర్ అంబేద్కర్ ఎక్సలేన్స్ 2026 అవార్డును అందుకున్న అచ్చమ్మకుంట తండా కుర్రాడు నేనావత్ అనిల్ కుమార్   •  

మంచి చేయాలని సంకల్పం మనసులో ఉండాలి

21-04-2026 04:42 PM

ఆరోగ్యం బాగుంటేనే జీవితం అద్భుతంగా ఉంటుంది

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్,(విజయక్రాంతి): మంచి చేయాలని సంకల్పం మనసులో ఉండాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం నగరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో56 సిఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని, ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యశాఖ చికిత్సలు పొందిన నిరుపేదలకు సైతం సహకారం అందించాలని సంకల్పంతో సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.

పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం పరిమితి రూ 5 లక్షల నుంచి రూ 10 లక్షలకు పెంచడం జరిగిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆరోగ్యం బాగుంటేనే ప్రతి వ్యక్తి జీవితం అద్భుతంగా ఉంటుందని, ప్రతి ఒక్కరు తమ వ్యక్తిగత ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో పాటు అవసరమైన సమయాన్ని కూడా కేటాయించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఆదాయం కూడా తగ్గడంతోపాటు జీవన ప్రమాణాలలో విపరీతమైన భేదాలు వస్తాయని పేర్కొన్నారు.

బాధ్యతగా ఉంటూ అవసరమైన సూచనలు సలహాలు తోటి వారికి చెప్పుకుంటూ అద్భుతమైన జీవితం గడిపేందుకు ప్రతి ఒక్కరు అడుగులు ముందుకు వేయాలని సూచించారు. కష్టపడ్డప్పుడే ఫలితం దక్కుతుందని ఆశించిన మేరకు కష్టపడకుండా అత్యాశ పడితే ఎప్పటికీ వారి నిర్దేశించుకున్న లక్ష్యం ఎప్పటికీ నెరవేరదని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ఎంతో గొప్ప లక్ష్యంతో ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకొని ముందుకు తీసుకుపోతున్నారని తెలిపారు.