27 June, 2026 | 2:51 AM

యువత చైతన్యవంతంగా వ్యవహరించాలి

27-06-2026 01:34 AM

మోకిల సీఐ శ్రీనివాస్ రెడ్డి

శంకర్ పల్లి జూన్ 26 (విజయక్రాంతి): మత్తు పదార్థాలను అరికట్టడంలో యువత చైతన్యవంతంగా వ్యవహరించాలని మోకిల సీఐ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం దొంతన్ పల్లి లోని ఇక్ఫాయ్ కళాశాలలో విద్యార్థులకు మారకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కళాకారులతో డ్రగ్స్ పై కళాజాత కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా డ్రగ్స్ విక్రయించిన, వాడకానికి ప్రేరేపించిన వెంటనే తమకు సమాచారం అందించాలని తెలిపారు. మత్తు పదార్థాల వినియోగంతో జీవితాలు నాశనం అవుతున్నాయని పేర్కొన్నారు. యువత మారకద్రవ్యాలకు దూరంగా ఉండి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని ఆకాంక్షించారు. డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరి సహకారం ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్త్స్ర సురేష్ గౌడ్, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.