గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి
గణపతి నవరాత్రి ఉత్సవాలను జిల్లాలో ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని, గణేష్ మండపాల వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ కోరారు. పట్టణంలోని తానిషా గార్డెన్ లో మంగళ వారం గణపతి మండప నిర్వహ కమిటీ సభ్యులు, హిందూ ఉత్సవ సమితి సభ్యులు, కౌన్సిలర్లు, నాయకులతో ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లా గణపతి నవరాత్రి ఉత్సవాలకు ప్రత్యేక స్థానం ఉందని, సంస్కృతిని, సాంప్రదాయాన్ని కాపాడుతూ, దానిని భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండేలా గణపతి నవరాత్రి ఉత్సవాలను నిర్వహించాలన్నారు.
01-09-2026 | 11:59pm