2 September, 2026 | 2:59 PM

దేవుల నాయక్ తండాలో గ్రంథాలయం ఏర్పాటుకు సన్నాహాలు

02-09-2026 | 01:51pm

బోథ్.సెప్టెంబర్ 2.( విజయ క్రాంతి): సోనాల మండలం(Sonala Mandal)లోని దేవుల నాయక్ తండా గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటుకు పోలీసు శాఖ, అధికారులు గ్రామ పెద్దలు చర్యలు చేపట్టారు. గ్రంథాలయం(Library) ఏర్పాటు వల్ల కలిగేలాభాలను పోలీసు అధికారులు గ్రామస్తులకు వివరించారు. దీంతో గ్రామంలోని సేవాలాల్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ సొసైటీ వారు తమ వంతు చేయూతనిచ్చేందుకు ముందుకు వచ్చారు. తాము పుట్టి పెరిగిన గ్రామంలో యువకులకు ఉపయోగపడే కార్యక్రమాన్ని చేపట్టాలని దృక్పథంతో  రూ.20వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని బుధవారం గ్రామ సర్పంచ్ బాబు సింగ్(Sarpanch Babu Singh) కు అందించారు.

గ్రామంలో ఉన్న గది మరమ్మతులకు రూ. 50వేల రూపాయల వరకు ఖర్చు అవుతుందని గమనించి తమ వంతుగా రూ.20వేల రూపాయలు అందిస్తున్నామని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో రామ్ కిషన్ నాయక్, కైలాస్, జే రోహిదాస్, ఆడే రోహిదాస్, రాహుసింగ్, తో పాటు ఉద్యోగ సంఘం సభ్యులు జె.వెంకటరావు, జె. గణేష్, ఆర్. ఆత్మారాం, జే.దేవిదాస్, ఆర్ మనోజ్‎లు ఉన్నారు విద్యార్థుల భవిష్యత్తు కోసం తమ బాధ్యతగా నిలుస్తామని వారు పేర్కొన్నారు.