అనురాగ్ లో బతుకమ్మ పండుగ వేడుకలు
ఘట్ కేసర్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను అనురాగ్ యూనివర్సిటీ సీఈఓ ఎస్. నీలిమ ఆధ్వర్యంలో శుక్రవారం యూనివర్సిటీ ప్రాంగణంలో అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో మహిళా అధ్యాపకులు, ఉద్యోగులు, విద్యార్థినీలు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని, రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, పాటలు పాడుతూ ఆటపాటలతో ప్రాంగణమంతా ఆనందోత్సాహాలను నింపినట్లు తెలిసింది. సీఈఓ, ఉపకులపతి వంటి ఉన్నతాధికారుల నుంచి సహాయక సిబ్బంది వరకు అందరూ విద్యార్థినులతో కలిసి బతుకమ్మ ఆడటం విశేషం.
16-10-2026 | 07:52pm