3 September, 2026 | 9:28 PM

Districts - Mulugu

article_60659063.webp
పస్రా, మేడారం రోడ్డుపై పోలీసుల స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

గోవిందరావుపేట,ఆగస్టు 28 (విజయక్రాంతి): పండగ చేసుకోండి.. ప్రాణాలతో చెలగాటం మాత్రం ఆడొద్దు.. మద్యం తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవని పసర ఎస్ ఐ తాజుద్దీన్ పేర్కొన్నారు. ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్(Mulugu District SP Sudheer Ramnath Kekan) ఆదేశాల మేరకు, ములుగు డీఎస్పీ ఎన్. రవీందర్ సూచనలతో, పస్రా సీఐ పీ. దయాకర్ పర్యవేక్షణలో పస్రా ఎస్ ఐ ఎస్.కె. తాజుద్దీన్, తాడ్వాయి ఎస్ ఐ కే. జగదీష్ గౌడ్, నర్లాపూర్/మేడారం ఎస్ ఐ ఎ. కమలాకర్ ఆధ్వర్యంలో పోలీసులు శుక్రవారం మేడారం రహదారిపై విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు.

28-08-2026 | 12:18pm

article_28094974.webp
బంజారా సమాజానికి తీజ్ ఉత్సవం ప్రత్యేకం

ములుగు, ఆగస్టు 27 (విజయ క్రాంతి): బంజారా సమాజానికి తీజ్ ఉత్సవం ఎంతో ప్రత్యేకమని మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో పస్రా గ్రామంలో సర్పంచ్ బూక్యా సుమలత ఇంటివద్ద గురువారం ఏర్పాటు చేసిన తీజ్ ఉత్సవాల్లో మంత్రి సీతక్క పాల్గొని బంజారా సోదర, సోదరీమణులకు తీజ్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తీజ్ పండుగ శుభసందర్భంగా సంత్ సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాల వేసి నమస్కరించిన మంత్రి సీతక్క, బంజారా సమాజం అభివృద్ధి, సంక్షేమం కోసం సంత్ సేవాలాల్ మహారాజ్ చూపిన మార్గం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

27-08-2026 | 03:39pm

article_40342378.webp
ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలని సూచన

గోవిందరావుపేట, ఆగస్టు 25 (విజయ క్రాంతి): జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామనాథ్ పస్రా పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీలో భాగంగా మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని రికార్డులు, కేసుల దర్యాప్తు పురోగతి, స్టేషన్ నిర్వహణ, సిబ్బంది విధులు, పెండింగ్ కేసుల వివరాలను ఎస్పీ సమీక్షించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై వేగంగా స్పందించి, పారదర్శకంగా విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. అలాగే స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, గంజాయి మరియు ఇతర అక్రమ కార్యకలాపాలపై నిఘా మరింత పెంచాలని ఆదేశించారు.

25-08-2026 | 04:32pm