Districts - Nalgonda

ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యుడిగా జంగిలి నాగరాజు
ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యుడిగా జంగిలి నాగరాజు

మునుగోడు: నల్లగొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా మునుగోడు మండలం గుండ్లోరిగూడెం గ్రామానికి చెందిన జంగిలి నాగరాజు నియమితులయ్యారు. జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ ఐఏఎస్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసి నియామక పత్రాన్ని అందజేశారు. తన నియామకానికి సహకరించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి, రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నాగరాజు కృతజ్ఞతలు తెలిపారు. కమిటీ సభ్యుడిగా బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తానని ఆయన పేర్కొన్నారు.

17-10-2026 | 07:54pm

కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతులకు కష్టాలే
కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతులకు కష్టాలే

దామరచర్ల: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు నీరు, విద్యుత్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, గతంలో కేసీఆర్ చెప్పిన మాటలు నిజమయ్యాయని జిల్లా బీఆర్ఎస్ నాయకులు ఎండి యూసుఫ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు నీరు, విద్యుత్ అందించడంలో విఫలమైందని ఆరోపించారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు నాణ్యమైన బొగ్గు సరఫరా చేయలేకపోవడం, రైతు బీమా ఇవ్వకపోవడంపై విమర్శలు గుప్పించారు. రానున్న రోజుల్లో మంత్రులను, ఎమ్మెల్యేలను రోడ్లమీద తిరగనివ్వమని హెచ్చరించారు.

16-10-2026 | 07:42pm

గ్రామాలలో క్షయరహిత లక్ష్యాన్ని సాధించాలి...
గ్రామాలలో క్షయరహిత లక్ష్యాన్ని సాధించాలి...

మునుగోడు: కొంపల్లి గ్రామ సర్పంచ్ జీడిమడ్ల నిర్మల దశరథ, ఉపసర్పంచ్ విజేందర్ రెడ్డిలు గ్రామాలలో టీబీ పరీక్షలతో క్షయరహిత లక్ష్యాన్ని సాధించవచ్చని అన్నారు. జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా టీబీ ముక్త్ భారత్ అభియాన్ ఆధ్వర్యంలో కొంపల్లి ఉన్నత పాఠశాలలో ఉచిత మొబైల్ ఏఐ చెస్ట్ ఎక్స్‌రే స్క్రీనింగ్ శిబిరం నిర్వహించారు. ప్రజలు స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకోవాలని, లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. ప్రభుత్వ శాఖలు, ఆరోగ్య సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, యువత సమన్వయంతో పనిచేస్తే క్షయరహిత నల్లగొండ లక్ష్యాన్ని సాధించవచ్చని పేర్కొన్నారు.

16-10-2026 | 07:41pm

పార్టీ బలోపేతమే లక్ష్యంగా నూతన కమిటీలు పనిచేయాలి
పార్టీ బలోపేతమే లక్ష్యంగా నూతన కమిటీలు పనిచేయాలి

మునుగోడు: మునుగోడు మండలంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే లక్ష్యంతో నూతన కమిటీలు పనిచేయాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సూచించారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆమోదించిన నియామకాల మేరకు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన నాయకులకు పార్టీ కమిటీల్లో బాధ్యతలు అప్పగించారు. హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే నివాసంలో నూతన కమిటీ సభ్యులు ఆయనను కలిసి సత్కరించారు. గ్రామస్థాయిలో పార్టీ కార్యకలాపాలను విస్తరించడం, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం లక్ష్యంగా ఈ కమిటీలు ఏర్పడ్డాయని వెల్లడించారు.

16-10-2026 | 06:39pm