3 September, 2026 | 10:29 PM

Districts - Rajanna Sircilla

article_23703098.webp
శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ

రుద్రంగి సెప్టెంబర్ 02(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలకేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది.శ్రావణమాసం బుధవారం సందర్భంగా శ్రీ లక్ష్మినరసింహ స్వామి ఆలయనికి భక్తులు పోటెత్తారు.ఉదయం నుండే ఆలయం భక్తులతో కిటకిటలాడింది ఇంటిల్లిపాది కుటుంబంతో వచ్చి స్వామివారిని దర్శించుకుని బియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రావణమాసం సందర్భంగా ఆలయాన్ని పూలతో మామిడి తోరణాలతో అందంగా ముస్తాబు చేసి భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని షౌకార్యాలు ఏర్పాటు చేసినట్టు ఆలయ కమిటీ చైర్మన్ సామ మోహన్ రెడ్డి తెలిపారు.

02-09-2026 | 04:56pm