3 September, 2026 | 10:12 PM

డాక్టర్ హరికాంత్ కు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు

03-09-2026 | 09:18pm

ముకరంపుర,(విజయక్రాంతి): శాతవాహన విశ్వవిద్యాలయం(Satavahana University) కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగంలో పనిచేస్తున్న డాక్టర్ డి. హరికాంత్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు(best teacher award)కు ఎంపికయ్యారు. సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని(Teacher's Day) పురస్కరించుకొని హైదరాబాద్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ఈ అవార్డును అందుకోనున్నారు.

కాకతీయ విశ్వవిద్యాలయం కామర్స్ విభాగం(Kakatiya University Department of Commerce) నుండి పిహెచ్‌డి  పూర్తి చేసిన డాక్టర్ హరికాంత్, 2015లో శాతవాహన విశ్వవిద్యాలయంలో సహాయ ఆచార్యులుగా చేరారు.విశ్వవిద్యాలయంలో కామర్స్ శాఖ విభాగాధిపతిగా, బిఓఎస్  చైర్మన్ గా విభిన్న పరిపాలనా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం ఆయన వైస్ ఛాన్స్‌లర్ ఓఎస్‌డీ గా సేవలు అందిస్తున్నారు. రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికైన డాక్టర్ డి. హరికాంత్‌ను విశ్వవిద్యాలయ అధ్యాపకులు, పాలకవర్గ సభ్యులు, సిబ్బంది, విద్యార్థులు అభినందించారు.