ప్రత్యేక ఓటర్ సవరణపై సమీక్ష
03-09-2026 | 03:04pm
బోథ్,సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): మండలంలోని మరల పెళ్లి గ్రామంలో ప్రత్యేక అధికారిగా ఎంపీడీవో రమేష్ ఓటరు సవరణపై( Special Voter Revision) సమీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా నో మ్యాపింగ్ అయినా ఓటర్ల వివరాలను పరిశీలించారు. అంతేగాక అనామాలిష్ ఓటర్ల సందేహాలను నివృత్తిచేశారు. ఓటర్ల వివరాలు సక్రమంగా ఉండేవిధంగా పత్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ సవరణ ప్రక్రియ కొనసాగించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ నీలాబాయి ఉపసర్పంచ్ రమేష్ పంచాయతీ కార్యదర్శి నాస్మిన్. జిపి వోలు పుష్పలత, నందీశ్వర్,బి ఎల్ ఓ రాఘవేందర్ తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.






