2 September, 2026 | 2:58 PM

అర్ధాంతరంగా ఆగిపోయిన పాఠశాల భవనం నిర్మాణం

02-09-2026 | 01:42pm

ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు

బోథ్, సెప్టెంబర్ 2(విజయక్రాంతి): బోథ్ మండలం(Boath Mandal)లోని కౌటబి ఉన్నత పాఠశాలలో మన ఊరు మనబడి కార్యక్రమం కింద పాఠశాలలో చేపట్టిన అదనపు గదుల నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయింది. విద్యార్థుల(Students') అవసరాలను గుర్తించిన గత ప్రభుత్వం పాఠశాల(Government school)లో అదనపు గదులను నిర్మించాలని తలపెట్టారు. అయితే కాంట్రాక్టర్ ముందుకు వచ్చి పనులు చేపట్టిన సకాలంలో బిల్లులు రాకపోవడంతో పాఠశాల నిర్మాణం అర్ధాంతరంగా అయిపోయింది. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 

సరిపడ గదులు లేక బోధనకు ఇబ్బందులు 

పాఠశాలలో విద్యార్థుల సంఖ్య కు అనుగుణంగా గదులు లేకపోవడం వల్ల విద్య బోధన చేయడం ఉపాధ్యాయుల కష్టంగా మారింది. పక్కనే ఉన్న ప్రాథమిక పాఠశాలలోని గదులలో విద్యార్థులకు బోధన చేస్తున్నారు. దీంతో ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సైతం ఇరుకు గదుల్లోనే చదువుకోవాల్సి వస్తున్నది. జిల్లా అధికారులు అర్ధాంతంగా నిలిచిపోయిన పాఠశాల భవనం పనులను పూర్తి చేయించాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు.