Districts - Mahabubnagar

అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందాలి!
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందాలి!

మహబూబ్ నగర్ జిల్లా గండీడ్: మండలంలోని కొమిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ సుజాత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామ పెద్దలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని నాయకులు సూచించారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు రేషన్ కార్డులు ఎంతో ఉపయోగకరమని, వీటి ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

17-10-2026 | 10:45pm