Districts - Warangal

భూ వివాదాలకు చెక్
భూ వివాదాలకు చెక్

పరకాల: భూముల రీసర్వేతో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్ గ్రామంలో జరుగుతున్న రీసర్వేను ఆయన పరిశీలించారు. ప్రతి భూమిని క్షేత్రస్థాయిలో కొలిచి, నక్ష ప్రకారం పాస్‌బుక్స్ అందించాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని, వారి అభ్యంతరాలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. రీసర్వే ప్రక్రియ సజావుగా సాగేందుకు రైతులు సహకరించాలని కోరారు. రికార్డులలో ఖచ్చితత్వం, పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలని వెల్లడించారు.

29-09-2026 | 12:10pm