National

తీరానికి ఐఫోన్లు.. పెర్ఫ్యూమ్ బాటిళ్లు.. వీడియో వైరల్
తీరానికి ఐఫోన్లు.. పెర్ఫ్యూమ్ బాటిళ్లు.. వీడియో వైరల్

సముద్రపు అలలతో పాటు ఐఫోన్లు, ఖరీదైన పెర్ఫ్యూమ్ బాటిళ్లు తీరానికి కొట్టుకొస్తే ఎలా ఉంటుంది? ప్రస్తుతం ఇలాంటి దృశ్యాలే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. హార్ముజ్ జలసంధిలో కార్గో షిప్ ప్రమాదానికి గురికావడంతో, అందులోని విలువైన వస్తువులు సముద్రంలో పడిపోయినట్లు ప్రచారం జరుగుతోంది.తీరానికి కొట్టుకొచ్చిన వస్తువులను ఏరుకునేందుకు స్థానికులు ఎగబడుతున్నట్లుగా కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే, వీడియోల్లో కనిపిస్తున్న దృశ్యాలన్నీ నిజమేనా? లేక ఏఐ సృష్టించినవా? అనే చర్చ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

18-10-2026 | 11:53am

మాజీ సీఎం ఇంటి గోడకు ఈడీ నోటీసు
మాజీ సీఎం ఇంటి గోడకు ఈడీ నోటీసు

తిరువనంతపురం: కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటైల్ లిమిటెడ్ (సీఎంఆర్‌ఎల్), ఎక్సాలాజిక్ సొల్యూషన్స్‌కు సంబంధించిన మనీలాండరింగ్ ఆరోపణలపై అక్టోబర్ 23న కొచ్చిలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. విజయన్ నివాసంలో లేకపోవడంతో, అధికారులు ఆయన ఇంటి గోడకు సమన్ల ప్రతిని అంటించారు. ఈ పరిణామం కేరళ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. విజయన్ కుమార్తె వీణకు చెందిన ఎక్సాలాజిక్ సంస్థకు సీఎంఆర్‌ఎల్ నుంచి రూ.2.78 కోట్ల చెల్లింపులు జరిగాయని దర్యాప్తు సంస్థ ఆరోపిస్తోంది.

17-10-2026 | 04:48pm