3 September, 2026 | 8:54 PM

Crime&legal -

article_23594116.webp
గల్లీ "టూ" పల్లె దాకా గుప్పుమంటున్న "గంజాయి" ఘాటు.!

బాన్సువాడ,సెప్టెంబర్ 3(విజయక్రాంతి): పట్టణాలకే పరిమితం అయింది అనుకున్న గంజాయి సమస్య(Marijuana) క్రమ క్రమంగా గ్రామాలు, పల్లెలు, గల్లీలకూ విస్తరిస్తోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మత్తు పదార్థాల ప్రభావం యువతపై పడకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత కుటుంబాలు, విద్యాసంస్థలు, ఎక్సైజ్, పోలీసులు, స్థానిక అధికారులు అందరిపైనా ఉంది. గంజాయి వినియోగం(Cannabis use) ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు చూపే అవకాశం ఉండటంతోపాటు, చిన్న వయసులోనే మత్తు పదార్థాల వైపు ఆకర్షితులయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2018 జాతీయ సర్వేలో 10–17 ఏళ్ల వయసు పిల్లలు, కిశోరుల్లో సుమారు 20 లక్షల మంది ప్రస్తుతం గంజాయి వినియోగిస్తున్నట్లు అంచనా వేశారు.

03-09-2026 | 12:32pm

article_46732914.webp
సొసైటీ సీఈవో మృతి

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని తాండూర్ గ్రామానికి చెందిన వడ్ల విట్టల్ అనారోగ్యంతో మృతి చెందారు.మృతుడు వడ్ల విట్టల్ నాగిరెడ్డిపేట్ మండలంలోని తాండూర్ సొసైటీలో,లింగంపేట్ మండల కేంద్రంలో మరియు నల్లమడుగు గ్రామ సొసైటీల సీఈఓలుగా పనిచేశారు. విషయం తెలుసుకున్న టిఆర్ఎస్ పార్టీ ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జ్ ఎదురుగట్ల సంపత్ గౌడ్ పరామర్శించి మృతి దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.సొసైటీ సీఈవో వడ్ల విట్టల్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల మాజీ ఎంపీపీ దివిటి రాజదాస్,సీనియర్ నాయకులు శ్రీనివాస్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు బాగా రెడ్డి,యూత్ మహమ్మద్ ఫయీమ్, లింగంపేట్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పోకల సాయిరాం,జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు జైల్ సింగ్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు శ్రీను,మండల ప్రధాన కార్యదర్శి మమ్మద్ ఖలీల్,మైనార్టీ నాయకులు జహీర్,బుర్ర కృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

26-08-2026 | 10:30am