3 September, 2026 | 8:56 PM

News -

article_29113239.webp
ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ

చంచల్ గూడ్-సంతోష్ నగర్ స్టీల్ ఫ్లై ఓవర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ప్రారంభించారు. గత సర్కార్ వంతెన నిర్మాణానికి సకాలంలో నిధులు ఇవ్వలేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేసి వంతెనను వేగంగా నిర్మాణం పూర్తి చేసిందని పేర్కొన్నారు. ఈ ప్రాంతమంతా ఓల్డ్ సిటీ కాదు.. ఇది ఒరిజినల్ సిటీ అని సీఎం చెప్పారు. ఒకప్పుడు హైదరాబాద్ నగర ప్రజలు ఈసా, మూసీ నది నీళ్లు తాగేవారని, హైదరాబాద్ కు విదేశీయులేవరు వచ్చిన చార్మినార్ వద్ద షాపింగ్ కు వస్తారని ఆయన గుర్తు చేశారు. పాతబస్తీలోని ప్రతి గల్లీ, అణువణువు నాకు తెలుసాని, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పేరు చాలా దేశాల్లో సుపరిచితం అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

03-09-2026 | 08:18pm

article_52142753.webp

article_36264960.webp
మంత్రి కొండా సురేఖపై ఎమ్మెల్యే రాజా సింగ్ వ్యాఖ్యలు వైరల్

దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు సంబంధించిన వివాదంపై గోషామహల్ ఎమ్మెల్యే టి. రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ కావడంతో పాటు, తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. మంత్రి కొండా సురేఖకు సంబంధించిన వ్యవహారం కొంతకాలంగా రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ అధిష్టానం, పార్టీ నాయకత్వం ఆమెను రాజీనామా చేయాలని కోరాయని, దీనిపై తన తదుపరి కార్యాచరణను ప్రకటించేందుకు ఆమె సిద్ధమవుతున్నారని సమాచారం. ఈ రాజకీయ పరిణామాల మధ్య, కొండా సురేఖను పార్టీ నుండి బయటకు పంపడానికి రాజకీయ కారణాలు కాకుండా, డబ్బు వాటాల పంపిణీకి సంబంధించిన వివాదమే కారణమని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆరోపించారు.

03-09-2026 | 04:18pm

article_55482298.webp
బర్తరఫ్ పై కొండా సురేఖ స్పందన

హైదరాబాద్: జగ్గారెడ్డి, రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై ఏం నిర్ణయం తీసుకున్నారు? అని కొండా సురేఖ(Konda Surekha) ప్రశ్నించారు. బర్తరఫ్ అనంతరం కొండా సురేఖ మాట్లాడుతూ... నాపై కక్షపూరితంగా చర్యలు తీసుకున్నారు. భవిష్యత్ కార్యాచరణపై ఇంకా ఆలోచించుకోలేదన్నారు. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడాన్ని కొండా సురేఖ ఖండించారు. నిర్ణయానికి ముందు నా వివరణ తీసుకోవాల్సిందని తెలిపారు. నా కూతురు వ్యాఖ్యలను నన్నెలా బాధ్యురాలిని చేస్తారు? అని ప్రశ్నించారు. నా కూతురు స్వతంత్ర మహిళ ఆమె వ్యాఖ్యలు ఆమెవే అన్నారు. నా కూతురు వ్యాఖ్యలను నేను ఖండించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. నా కూతురు వ్యక్తిగత అభిప్రాయాన్ని తప్పుపట్టే అధికారం నాకు లేదని చెప్పారు. అధిష్ఠానానికి నేను ఇచ్చిన లేఖను మీడికు ఇస్తున్నానని పేర్కొన్నారు.

03-09-2026 | 03:42pm