3 September, 2026 | 9:22 PM

Districts - Sangareddy

article_31117021.webp
స్వచ్ఛంద సంస్థల సేవలు అభినందనీయం

పటాన్ చెరు, సెప్టెంబర్ 3: ముత్తంగి డివిజన్ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓసాట్ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో రూ.80 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న నాలుగు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు గురువారం ఉదయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి(MLA Gudem Mahipal Reddy) ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. ముత్తంగి ప్రాంతంలో పేద, మధ్యతరగతి కుటుంబాలు అధికంగా నివసిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులకు నాణ్యమైన, మెరుగైన విద్య అందేలా అవసరమైన అన్ని మౌలిక వసతులను కల్పిస్తున్నామని చెప్పారు.

03-09-2026 | 02:56pm

article_61506901.webp
మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి

మునిప‌ల్లి, సెప్టెంబ‌ర్ 2( విజయ్ క్రాంతి ): మండ‌ల కేంద్ర‌మైన మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్ ను బుధ‌వారం జిల్లా గ్రంథాల‌య సంస్థ చైర్మ‌న్ అంజ‌య్య, ఎస్సీ కార్పొరేష‌న్ ఈడీ, మండ‌ల ప్ర‌త్యేకాధికారి రామాచారి, రాయికోడ్ మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్ సుధాక‌ర్ రెడ్డి ఆక‌స్మికంగా త‌నిఖీ చేసి ప‌రిస‌రాలు, కిచెన్ , స్టోర్ రూమ్ ల‌ను ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా హాస్ట‌ల్ ప‌రిశుభ్రంగా బాగుందని హాస్ట‌ల్ వార్డెన్ రామ‌ప్పను అభినందించారు. అనంత‌రం హాస్ట‌ల్ లోని బియ్యాన్ని ప‌రిశీలించి పురుగులుమాత్రం రావడం లేదు క‌దా.. అంటూ వార్డెన్ రామ‌ప్పను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట అధికారులు, స‌ర్పంచులు ఉన్నారు.

02-09-2026 | 08:05pm