Districts - Kamareddy

కామారెడ్డిలో బతుకమ్మ నిమజ్జనం కోసం పాట్లు
కామారెడ్డిలో బతుకమ్మ నిమజ్జనం కోసం పాట్లు

కామారెడ్డి: తెలంగాణ బతుకమ్మ పండుగ సందర్భంగా కామారెడ్డి పెద్ద చెరువు వద్ద బతుకమ్మ నిమజ్జనం ఏర్పాట్లలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహించారు. విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయకపోవడంతో ఆదివారం రాత్రి నిమజ్జనం కోసం వచ్చిన మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్థానిక కౌన్సిలర్ నరేందర్ రెడ్డి ముందుగానే వినతి పత్రం ఇచ్చినా అధికారులు పట్టించుకోలేదని తెలిసింది. ముస్లిం కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించడం వల్లే నిర్లక్ష్యం జరిగిందని బిజెపి కౌన్సిలర్ నరేందర్ రెడ్డి ఆరోపించారు. మహిళలు టార్చిలైట్లతో నిమజ్జనం చేసి, అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

18-10-2026 | 08:34pm