3 September, 2026 | 11:02 PM

క్రాంతి విద్యాలయంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

03-09-2026 | 10:05pm

భద్రాచలంటౌన్,(విజయక్రాంతి): భద్రాచలం పట్టణంలోని క్రాంతి విద్యాలయంలో కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని క్రాంతి విద్యాసంస్థల(Kranti Educational Institutions) కరస్పాండెంట్ పానుగంటి సమత శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు(Krishnashtami celebrations) గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు శ్రీకృష్ణుడు, రాధ, గోపికలు, యశోదమ్మ తదితర వేషధారణలతో అందరినీ ఆకట్టుకున్నారు.

ఈ సందర్భంగా క్రాంతి విద్యాసంస్థల కరస్పాండెంట్ పానుగంటి సమత శ్రీనివాస్ మాట్లాడుతూ... కృష్ణాష్టమి వేడుకలు అనేది భారత దేశ సంస్కృతి(Indian culture), సాంప్రదాయాలు నేటితరం తెలుసుకోవలసినటువంటి ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చని మంచి చెడుల, విచక్షణము ధర్మానికి, అధర్మానికి మధ్యగల బేధాలను తెలుసుకోవడానికి జీవన సాఫల్యం అంతరార్ధాన్ని గ్రహించడానికి శ్రీకృష్ణుడు యొక్క జీవన విధానం దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.

లోకం తీరుతెన్నులు జీవన సత్యాలు వంటి అనేకమైన సాంఘిక జీవనాన్ని గూర్చి శ్రీకృష్ణుని జీవితం స్పష్టంగా తెలియజేస్తుందని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన గోకులం వేడుకల్లో శ్రీకృష్ణ, గోపికల వేషధారణలో విద్యార్థులు ఉత్సాహంగా ఉట్టి కొట్టి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఐ. హేమ శిల్ప మరియు అధ్యాపక, అధ్యాపకేతర బృందంతో పాటు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.