సమైక్యతతో పండుగలు జరుపుకోవాలి
మందమర్రి: ప్రజలు సమైక్యతతో సంతోషంగా పండుగ జరుపుకోవాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆదివారం క్యాతనపల్లి పురపాలక పరిధిలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, సింగరేణి సంస్థ మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ రాధాకృష్ణ, డి.సి.సి. రఘునాథ్, అధికారులతో కలిసి పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, ఠాగూర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాలలో పాల్గొన్నారు. ఈ పండుగల ద్వారా శాంతి, సౌభాగ్యాలు, సామరస్యం చేకూరాలని ఆయన పేర్కొన్నారు.
18-10-2026 | 10:25pm