శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ ద్వితీయ వార్షికోత్సవం
ఖానాపూర్: ఎన్టీఆర్ మార్గ్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ వార్షికోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, యజ్ఞం, హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ ఎర్రబోతు రాజేందర్, ప్రముఖ వైద్యులు డాక్టర్ దేవేందర్ రెడ్డి, అభివృద్ధ సంక్షేమ సంఘం అధ్యక్షులు భూసారపు గంగాధర్, ఇతర కమిటీ సభ్యులు హాజరయ్యారని తెలిసింది.
16-10-2026 | 06:39pm