పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
మోతె: అక్టోబర్ 15న మోతె మండలంలోని నామవరం, రాఘవపురం గ్రామాల్లో ఎండిపోతున్న పంట పొలాలను గ్రామీణ పేదల సంఘం, ఓపిడిఆర్ నాయకులు పాలకూరి ఎల్లయ్య, తండు మల్సూరు ఆధ్వర్యంలో కార్యకర్తలు పరిశీలించారు. మండలంలో 70 శాతం పంటలు నీటి సౌకర్యం లేక, విద్యుత్ కోతల వల్ల ఎండిపోతున్నాయని నాయకులు తెలిపారు. 24 గంటల ఉచిత విద్యుత్ హామీ ఉన్నప్పటికీ, కనీసం ఎనిమిది గంటలు కూడా సరఫరా కావడం లేదని విమర్శించారు. ప్రాజెక్టులు నిండినా దిగువ ప్రాంతాలకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు.
15-10-2026 | 07:05pm