Districts - Siddipet

బీజేపీ ములుగు మండల అధ్యక్ష పదవికి లక్ష్మణ్ గౌడ్ రాజీనామా
బీజేపీ ములుగు మండల అధ్యక్ష పదవికి లక్ష్మణ్ గౌడ్ రాజీనామా

గజ్వేల్: భారతీయ జనతా పార్టీ ములుగు మండల అధ్యక్ష బాధ్యతలకు కే. లక్ష్మణ్ గౌడ్ రాజీనామా చేశారు. బీజేవైఎం ములుగు మండల అధ్యక్షుడి నియామక ప్రక్రియలో తనను సంప్రదించకపోవడం, క్షేత్రస్థాయి కార్యకర్తకు అన్యాయం జరిగిందని పేర్కొంటూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. తన రాజీనామా లేఖను సిద్దిపేట జిల్లా పార్టీ అధ్యక్షులు బైరి శంకర్ ముదిరాజ్ కి పంపినట్లు తెలిపారు. ఈ రాజీనామా ప్రతులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు, మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావుకి కూడా పంపినట్లు వెల్లడించారు.

18-10-2026 | 02:26pm

పంటల సాగుపై.. అధికారుల క్షేత్ర పరిశీలన
పంటల సాగుపై.. అధికారుల క్షేత్ర పరిశీలన

కోహెడ: కోహెడ మండలంలో వ్యవసాయ శాఖ అధికారులు పంటల సాగుపై క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి సతీష్, విస్తరణ అధికారులు శ్రీధర్ రెడ్డి, శివ కుమార్, మైపాల్ రెడ్డిలతో కలిసి వరి, పత్తి, కంది పంటల ఎదుగుదల, చీడపీడల ఉధృతిని పరిశీలించారు. వరిలో బ్రౌన్ ప్లాంట్ హాపర్, పత్తిలో రసం పీల్చే పురుగుల నివారణకు సమగ్ర యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలు పాటించాలని రైతులకు సూచించారు. వర్షాభావ పరిస్థితుల్లో తేమ సంరక్షణ, కలుపు నివారణపై అవగాహన కల్పించారు. పురుగుల ఉధృతిని బట్టి సిఫార్సు చేసిన మందులు పిచికారి చేయాలని తెలిపారు.

17-10-2026 | 09:20pm