ఆలేరులో దొంగతనాలు ఆగవా?
ఆలేరు, అక్టోబర్ 14: ఆలేరు మండలంలో బైకులు, బోరు మోటార్లు, ట్రాన్స్ఫార్మర్ల చోరీలతో పాటు మహిళల పుస్తెలతాళ్లు, ప్రయాణికుల సెల్ఫోన్లు మాయమవుతుండటంతో ప్రజలు, రైతులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. గొలనుకొండ గ్రామానికి చెందిన మారుపెళ్లి భాగ్యమ్మ భర్త సాయిలు బైక్, బండ్రు గణేష్ బైక్ చోరీకి గురయ్యాయి. పర్రె మైసమ్మ గుడి పరిసరాల్లో పది వ్యవసాయ మోటార్ల వైర్లు దొంగలపాలు కాగా, విజయ పార్క్ సమీపంలో ట్రాన్స్ఫార్మర్ ధ్వంసమైంది. పోలీసుల గస్తీ, నిఘా లోపంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
15-10-2026 | 05:05am