3 September, 2026 | 10:12 PM

అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందాలి: పోచారం శ్రీనివాసరెడ్డి

03-09-2026 | 09:15pm

నస్రుల్లాబాద్,(విజయక్రాంతి): అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందాలని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి(MLA Pocharam Srinivas Reddy) అన్నారు. కామారెడ్డి జిల్లా(Kamareddy districtనసురుల్లాబాద్ మండలం కాంశేట్ పల్లి గ్రామంలో గురువారం నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ(Distribution of smart ration cards) కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడుతూ... ప్రజల సంక్షేమమే ప్రభుత్వాల ప్రధాన లక్ష్యమని ఆన్నారు, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేయాలని అధికారులకు సూచించారు.