15 August, 2026 | 3:50 PM

కోర్టు ఆవరణలో జెండా పండుగ

15-08-2026 02:57 PM

నిర్మల్, ఆగస్టు 14 ( విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రధాన న్యాయస్థానంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి జెండా ఆవిష్కరించారు..  జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.   పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. దేశ స్వాతంత్ర్యాన్ని సాధించేందుకు మహనీయులు చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి రవీందర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శుభకరణ్, కోర్టు సిబ్బంది, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.