16 August, 2026 | 11:19 AM

రూ.7 వేలు ఇవ్వాల్సి వస్తుందని వాహనంతో తొక్కించి.. మహిళ దారుణ హత్య.!

16-08-2026 10:15 AM

నాగర్ కర్నూల్ ఆగస్టు 15 (విజయక్రాంతి): తనకు ఇవ్వాల్సిన రూ.7 వేల కోసం అడిగిన మహిళను వాహనంతో తొక్కించి హత్య చేసిన ఘటన తాడూరు మండల కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. తెలకపల్లి మండలం రాకొండ గ్రామానికి చెందిన నాగి బంగారమ్మ (43)కు తాడూరుకు చెందిన భీమయ్యతో కొంతకాలంగా పరిచయం ఉంది.

తనకు ఇవ్వాల్సిన రూ.7 వేల కోసం బంగారమ్మ శనివారం సాయంత్రం భీమయ్య పొలానికి వెళ్లి డబ్బులు ఇవ్వాలని అడిగింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. రూ.7 వేలు ఇవ్వాల్సి వస్తుందనే కారణంతో భీమయ్య తన వాహనాన్ని బంగారమ్మపైకి ఎక్కించడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న సీఐ అశోక్‌రెడ్డి, ఎస్సై రాములు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.