15 August, 2026 | 3:50 PM

సభా వేదికపై హాజరైన అతిథులు

15-08-2026 02:45 PM

రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు 

నిర్మల్ లో ప్రభుత్వ చీప్ వీప్ వేముల వీరేశం 

ఎన్టీఆర్ స్టేడియంలో అలరించిన కార్యక్రమాలు 

నిర్మల్, ఆగస్టు 14 (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినిస్ట్రీలో శనివారం 80 స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్ వేముల వీరేశం ముఖ్య అతిథిగా హాజరై జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా తో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందలని స్వీకరించి పెరేడ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశంలో దేశం అని రంగాల్లో అభివృద్ధి పథంలో నడుస్తుందని గుర్తు చేశారు.

భారతదేశ స్వాతంత్రం కోసం అనేకమంది మహా నాయకులు ప్రాణాలను త్యాగం చేశారని వారి త్యాగాల ఫలితమే నేటి స్వతంత్ర భారతదేశమని గుర్తు చేశారు. నిర్మల్ జిల్లాలో ప్రజా పాలన ప్రభుత్వం ద్వారా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తుందని ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా స్టేడియంలో శకటాల ప్రదర్శన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు స్టార్ల సందర్శన మహిళలకు చెక్కుల పంపిణీ తదితర కార్యక్రమాలన నిర్వహించారు. ఉత్తమ అవార్డులను అందించారు. గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్లు కిషోర్ కుమార్ ,వెంకటేశ్వర్లు, ఏఎస్పీ సాయికిరణ్, సబ్ కలెక్టర్ సాంకేతి కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ అప్పల కావ్య గణి చక్రవర్తి, స్థానిక నాయకులు అధికారులు పాల్గొన్నారు.