గురుకుల పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు
15-08-2026 03:02 PM
నిర్మల్, ఆగస్టు 15 (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల బాలుర పాఠశాలలో శనివారం న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. న్యాయమూర్తి రవికుమార్ చదువుకున్న విద్యార్థులకు భారత రాజ్యాంగంలోని చట్టాలు రాజ్యాంగపరమైన హక్కులు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. బాల కార్మిక నిర్మూలన బాల్యవివాహాల నిషేధం చట్టాల గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారి జీవన్ కుమార్ న్యాయమూర్తులు పాల్గొన్నారు.






