15 August, 2026 | 3:06 PM

బిజెపి కార్యాలయంలో జెండా ఆవిష్కరణ

15-08-2026 01:32 PM

నిర్మల్, ఆగస్టు 14 ( విజయ క్రాంతి): నిర్మల్ రూరల్ మండలంలోని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పార్టీ జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ జెండాను ఎగరవేశారు. స్వతంత్ర భారతదేశంలో మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశరక్షణ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ దేశ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చందు బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.