15 August, 2026 | 5:45 PM

వేగవంతంగా అభివృద్ధి చేస్తున్నాం: మంత్రి జూపల్లి

15-08-2026 04:48 PM

ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు 

మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు పంపిణీ చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు

మహబూబ్ నగర్ (విజయ క్రాంతి): అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణరావు అన్నారు. శనివారం నగరం లోని ఫారెడ్ గ్రౌండ్ లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఘనంగా జరిగాయి. సందర్భంగా జాతీయ జెండా ను ఆవిష్కరణ చేశారు. ఈ మేరకు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ (డి.ఆర్‌.డి.ఎ) ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు  బ్యాంకు లింకేజీ ద్వారా మంజూరైన రుణాలకు సంబంధించిన  ఆర్థిక సహాయాన్ని  రాష్ట్ర ఎక్సైజ్, ప్రొహిబిషన్, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు మహిళా సంఘాలకు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడారు. జిల్లాలోని 1,219 మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా రూ.143 కోట్ల రుణాల చెక్ ను మంత్రి  మహిళ సంఘాల సభ్యులకు అందజేశారు.

 నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ కింద 559 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున మొత్తం రూ.1.11 కోట్ల ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేశారు. అనంతరం స్వయం ఉపాధి, నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించే కార్యక్రమాల్లో భాగంగా 350 మందికి టైలరింగ్ శిక్షణ సర్టిఫికెట్లు, 25 మంది విద్యార్థులకు సైకిళ్లు, 14 మంది లబ్ధిదారులకు స్కూటర్లు మంత్రి జూపల్లి కృష్ణారావు పంపిణీ చేశారు. మహిళా సంఘాల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకుని మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవాలని ఈ సందర్భంగా  మంత్రి సూచించారు. అనంతరం కలెక్టర్ లోని సమావేశ మందిరం నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను మంత్రి అందజేశారు. 

ఈ కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా,దేవరకద్ర శాసన సభ్యులు సభ్యులు జి.మధు సూదన్ రెడ్డి, ఎస్.పి.డి.జానకి, మేయర్ మమత,ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ సాయి శివాని, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్,మార్కెట్ కమిటీ  చైర్మన్ బెక్కరి అనితా మధుసూదన్ రెడ్డి,భూత్పూర్ మున్సిపల్ చైర్మన్ బాల కోటి,అదనపు కలెక్టర్ లు మధుసూదన్ నాయక్ రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.ఎల్ బి హరిప్రియ,తదితరులు పాల్గొన్నారు