15 August, 2026 | 3:29 PM

అంగరంగ వైభవంగా 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

15-08-2026 02:27 PM

మూసాపేట్ ఆగస్టు 15: మూసాపేట్ మండల కేంద్రంతో పాటు తాసిల్దార్ కార్యాలయం ,ఎంపీడీవో కార్యాలయం ,పోలీస్ స్టేషన్, కస్తూరిబా ఉన్నత పాఠశాల తో పాటు వివిధ గ్రామాల గ్రామపంచాయతీ ఆఫీస్ లో దగ్గర శనివారం జాతీయ జెండా ను  ఎగరవేసి అంగరంగ వైభవంగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులచే ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు . ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు గ్రామాల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగాల ఫలమే నేడు స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ రాజు నాయక్ ,ఎస్సై వేణు, ఎంపీడీవో కృష్ణయ్య, వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు ప్రజా ప్రతినిధులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.