15 August, 2026 | 4:53 AM

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు

15-08-2026 12:00 AM

రాజాపూర్ ఆగస్టు 14 : భారతదేశ 80 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలకు మండలంలోని వివిధ గ్రామాల్లో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. మండల కేంద్రంతో పాటు మండలంలోని ఆయా గ్రామాల్లో ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలలు అంగన్వాడి కేంద్రాలు యువజన సంఘాల ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరిపేందుకు కార్యాలయాలను సుందరంగా ముస్తాబు చేస్తున్నారు.

రంగారెడ్డి గూడలో గ్రామ నడిబొడ్డులో ఉన్న చరిత్రకు సాక్ష్యమైన సింహాల స్థూపాన్ని  స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అదే గ్రామానికి చెందిన పెయింటర్  అయూబ్ ఖాన్  తన సొంత ఖర్చులతో రంగులు వేయించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు అభినందించారు.