15 August, 2026 | 3:00 AM

ఘనంగా తిరంగా ర్యాలీ

15-08-2026 12:00 AM

చిన్నంబావి,ఆగస్టు 14: భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు చేపట్టిన ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండల కేంద్రంలో తిరంగా ర్యాలీని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు బొగ్గు కురుమయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి జాగ్గరి శ్రీధర్ రెడ్డి,బిజెపి నేత కురువ చిన్న మల్లయ్య చేతిలో జాతీయ జెండా పట్టుకుని ర్యాలీని ముందుండి నడిపించారు.

ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ తిరంగా కేవలం మూడు రంగుల జెండా మాత్రమే కాదని, అది భారత సమగ్రతకు, ఐక్యతకు స్వాతంత్య్ర సమరయోధుల అమూల్య త్యాగాలకు ప్రతీక అని పేర్కొన్నారు.అనంతరం మండల ప్రధాన చౌరస్తాలో పాఠశాల విద్యార్థులతో కలిసి జాతీయ గీతాలాపన చేశారు.ఈ కార్యక్రమంలో  చెన్నయ్య యాదవ్, లింగ స్వామి,జింకల కిరణ్, సంపత్,బాలయ్య తదితర నాయకులు పాల్గొన్నారు.