15 August, 2026 | 3:29 PM

ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఘన సన్మానం

15-08-2026 02:32 PM

మహమ్మదాబాద్: మండల పరిధిలోని మంగంపేట్ తండాకు చెందిన విద్యార్థులు జేఈఈ మెయిన్స్‌లో ప్రతిభ కనబర్చి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో బీటెక్ సీట్లు సాధించడంతో గ్రామస్తులు వారిని ఘనంగా సన్మానించారు. మంగంపేట్ తండాకు చెందిన అంగోత్ శివకుమార్ ఐఐఐటీలో బీటెక్ సీఎస్‌ఈ సీటు సాధించారు. కాట్రావత్ వినోద్ ఐఐటీ గువాహటి, అసోంలో బీటెక్ ఈసీఈ సీటు సాధించారు. 

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఎస్. గోపాల్, మాజీ సర్పంచ్ ఏ. గీత పాండు ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు విద్యార్థులను ఘనంగా సన్మానించారు. విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదిగి దేశానికి మంచి ఇంజనీర్లుగా సేవలందించాలని ఆకాంక్షించారు.ఈ సన్మాన కార్యక్రమంలో గోపాల్ నాయక్, సుబ్యా నాయక్, మహేష్ నాయక్, గోపాల్ కారోబార్, రవి నాయక్, గ్రామపంచాయతీ కార్మికులు బీమి బాయి, బీమ్లా, జమణి బాయి, విజయ బాయి, మంజుల, వినోద్ తదితరులు పాల్గొన్నారు.