2 May, 2026 | 9:23 PM

Breaking News

ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా శ్రీకాంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం   •   విద్యార్థుల భవిష్యత్తును ఉపాధ్యాయులు బాధ్యతగా తీసుకోవాలి   •   మెట్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం   •   సింగరేణి శైలో బంకర్ బాధితులకు ప్రభుత్వ అండ   •   బాధ్యతలు స్వీకరించిన నూతన మెజిస్ట్రేట్ అరుణ్ కుమార్   •   బాధిత కుటుంబానికి పరిహారం ఇప్పించిన ఎమ్మెల్యే వేముల వీరేశం   •   అడవులలో లభించే ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన గిరిజన మార్చ్ ప్రజలకు ఎంతో ఉపయోగం   •   25 ఏళ్లుగా సేవలందిస్తున్న డా.మురళీ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు   •   ఎస్సెస్సీ ఫలితాల్లో సత్తా చాటిన నూకలమర్రి ఉన్నత పాఠశాల విద్యార్థులు   •   తూప్రాన్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా యంజాల కీర్తన ప్రమాణ స్వీకారం   •  

యువత ఉపాధి రంగలవైపు ఆలోచించాలి

10-03-2026 01:06 AM

షార్ట్ టర్మ్ స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సును ఎమ్మెల్యే పాయల్

ఆదిలాబాద్, మార్చి 9 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలో త్వరలో ఏర్పాటు కానున్న ఎయిర్ పోర్ట్ వంటి కొత్త ప్రాజెక్టుల వల్ల స్థానిక యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలను రానున్నాయని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్ లోని ఐటీఐ కళాశాలలోని అడ్వానస్డ్ ట్రైనింగ్ సెంటర్ లో నిర్వహిస్తున్న షార్ట్ టర్మ్ స్కిల్ డెవలప్మెంట్ కోర్సును మున్సిపల్ ఛైర్పర్సన్ బండారి అనూష సతీష్ తో కలిసి  ఎమ్మెల్యే ప్రారంబించి, వాటిని పరిశీలించారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..  యువత టెక్నికల్ తో పాటు వృత్తి పరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని  సూచించారు. అప్పు డే ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ సాధ్యంకావు, కావున యువత నైపుణ్యాలను పెంపొందించుకుని స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలని సూచించారు. అలాగే ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. యువత ఐటీఐ, ఏటీసీ ద్వారా అందిస్తున్న శిక్షణ కార్యక్రమాలను సద్వినియో గం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఐటీఐ అబివృద్ధి కమిటీ చైర్మన్ బాలూరి గోవర్ధన్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, బిజెపి నాయకులు దయాకర్, రామదాసు తదితరులు పాల్గొన్నారు.