31 August, 2026 | 2:14 AM

అక్టోబర్ 18న యూత్ ఎంపవర్మెంట్ ఫెస్ట్

31-08-2026 12:00 AM

వాల్‌పోస్టర్ ఆవిష్కరించిన పసాలా ఫౌండేషన్ నిర్వాహకులు

పంజాగుట్ట, ఆగస్టు 30(విజయక్రాంతి): యువతను అన్ని విధాలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో తమ సంస్థ పని చేస్తోందని పసాలా ఫౌండేషన్ వ్యవస్థాపకులు విక్రమ్ సాగర్ పసాలా తెలిపారు. అందులో భాగంగా అక్టోబర్ 18న భువనగిరి జిల్లా మోత్కూరులో యూత్ ఎంపవర్మెంట్ ఫెస్ట్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఫెస్ట్ కు సంబంధించిన గోడపత్రికను సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విక్రమ్ సాగర్ మాట్లాడుతూ యువతలో విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత పెంపొందించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. 

ఉచితంగా నిర్వహించనున్న ఎంపవర్మెంట్ ఫెస్టులో విద్యార్థులు, యువత, విద్యావేత్తలు, నిపుణులు, స్వచ్ఛంద సంస్థలు, కమ్యూనిటీ ప్రతినిధులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, సాంకేతికత, నాయకత్వం, వ్యక్తిగత అభివృద్ధి వంటి అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ఫెస్ట్ లో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పసాలా ఫౌండేషన్ సహ వ్యవ స్థాపకులు, చైర్మన్ అర్జున్ మదను, సీఈఓ గోకుల్ రమణ, ప్రొగ్రాం డైరెక్టర్ రాజా, రీజనల్ కోఆర్డినేటర్ పసాలా విజయానంద్, పబ్లిక్ రిలేషన్స్ అండ్ కమ్యూనికేషన్ డైరెక్టర్ శంకర్  తదితరులు పాల్గొన్నారు.