ప్రజావాణికి బ్రేక్..
అధికారులంతా మంత్రి పర్యటన ఏర్పాట్లలో బిజీ
గద్వాల టౌన్ ఆగస్టు 30 : జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి తాత్కాలిక విరామం ప్రకటించారు.సోమవారం కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి జిల్లా పర్యటనకు రానున్న నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు.
మంత్రి పర్యటన ఏర్పాట్లతో పాటు ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ నోటీసుల జారీ ప్రక్రియకు సంబంధించిన విధుల్లో జిల్లా అధికారులు నిమగ్నమై ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.ఈ విషయాన్ని ప్రజలు ముందుగానే గమనించి సోమవారం ప్రజావాణి కోసం జిల్లా కలెక్టరేట్కు రావద్దని అధికారులు సూచించారు.ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు సమాచారం అందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.






