26 June, 2026 | 9:02 PM

రగుడు ఎల్లమ్మ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం

26-06-2026 07:32 PM

కారు–బైక్ ఢీ.. ఇద్దరికీ తీవ్ర గాయాలు

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రగుడు ఎల్లమ్మ ఆలయం సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు, బైక్ ఎదురెదురుగా ఢీకొనడంతో బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను 108 అంబులెన్స్ సహాయంతో సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందుతున్నట్లు సమాచారం. ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టి కేసు నమోదు చేసే ప్రక్రియలో ఉన్నారు.