28 April, 2026 | 5:51 PM

Breaking News

విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పల్లె బాట   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు   •   ప్రజల దాహం తీర్చిన సీనియర్ హైకోర్టు న్యాయవాది మొహ్మద్ మొయిన్ అహ్మద్ ఖాద్రి   •   జొన్నల కొనుగోలు సెంటర్లను పెంచండి   •   తుమ్మల నివాసంలో పూర్వ మిత్రుల కలయిక   •   అశ్వాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ మంజూరుపై ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు   •   దేవరకొండలో కళాశాల గోడపత్రిక ఆవిష్కరణ   •   దేవరకొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్.. నలుగురు కో-ఆప్షన్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక   •   బేగంపేట్‌లో మాజీ మంత్రి జీవన్ రెడ్డికి ఘన సన్మానం   •   నిలిచిపోయిన నీటి దారులు   •  

సీఎం రేవంత్, మంత్రి పొన్నం చిత్రపటాలకు యూత్ కాంగ్రెస్ పాలాభిషేకం

28-04-2026 04:03 PM

ముకరంపుర,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, కార్మిక సంఘాల ఎన్నికలకు సమ్మతి తెలపడం, 10% ఫిట్‌మెంట్‌కు అంగీకరించడం, పలు డిమాండ్ల పరిష్కారానికి అంగీకరించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కరీంనగర్ నగర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉప్పరి విశాల్ ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని ఇందిరా చౌక్ వద్ద  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో నగర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉప్పరి విశాల్, మాజీ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు.