యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
సర్వోత్తమ్ రెడ్డి
సూర్యాపేట, జూన్ 26 (విజయక్రాంతి) : యూత్ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ప్రభు త్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలని ఏఐసిసి సభ్యులు రాంరె డ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. శుక్రవారం కాం గ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఎలిమినేటి అభిన య్ అధ్యక్షతన యూత్ కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్ర మం లో ఆయన మున్సిపల్ చైర్ పర్ సేన్ మొ రిశెట్టి నివేదిత లక్షాదిలతో కలిసి పాల్గొని మాట్లాడారు.
యూత్ కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాల న్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో 35 00 ఇందిరమ్మ ఇళ్లను పేదలకు కేటాయించడం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం ప్ర తి నియోజకవర్గానికి 175 కోట్లు ఖర్చు చే స్తుందని అన్నారు. ఈ పథకాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన కార్యక ర్తలకు పిలుపునిచ్చారు. నూతనంగా జరుగు తున్న ఎస్‌ఐఆర్ సర్వేలో కాంగ్రెస్ పార్టీ తరఫున బిఎల్ ఎ ల నియామకం జరిగిం దని, ప్రతి బూతులో కూడా ఏ ఒక్క ఓటు కూడా తీసివేయకుండా పనిచేయాలన్నారు.
పార్టీలో కష్టపడి పనిచేసే వారికి ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుందని తన తండ్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి యూత్ కాంగ్రెస్ నాయ కులను ఆదరించే వారిని, వారికి పార్టీలో ప్రాధాన్యత కల్పించారని తాను కూడా అదే బాటలో పయనిస్తాయని ఆయన చెప్పారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షఫి వుల్లా, ఫ్లోర్ లీడర్ కుమ్మరకుంట్ల వేణుగోపాల్ , జిల్లా కాంగ్రెస్ పార్టి కోశాధి కారి కక్కిరేణి శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ నాయకులు ఎలిమినేటి సురేష్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అంజద్ అలి, పార్టీ నాయకులు వీరన్న నాయక్, తంగెళ్ల కరుణాకర్ రెడ్డి ,అబ్దుల్ రహీం, కౌన్సిలర్ లు కొండపల్లి దిలీప్ రెడ్డి,, నాగుల వాసు, మహిళా కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.






