27 June, 2026 | 3:45 AM

మౌలిక వసతుల కల్పనే ప్రభుత్వ లక్ష్యం

27-06-2026 02:27 AM

గరిడేపల్లి, జూన్ 26 : గ్రామాలలో మౌలిక వసతుల కల్పన ప్రభుత్వ లక్ష్యం అని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు త్రిపురం అంజన్ రెడ్డి అన్నారు.మండలంలోని వెలిదండ గ్రామంలో రూ.15 లక్షల వివిధ అభివృద్ధి పనులను శుక్రవారం గ్రామ సర్పంచ్ చెనగాని సాంబయ్య తో కలిసి ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో మంజూరైన 15 లక్షల నిధులతో గ్రామంలో నూతన డ్రైనేజీ, సిసి రోడ్ల నిర్మాణ పనులను చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్ర మంలో మలిదశ ఉద్యమకారుల కన్వీనర్ మేకల నాగేశ్వరరావు,  ఉపసర్పంచ్ యనాల సోమ య్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వీసాల వెంకటేశ్వర్లు, చెన్నగాని రామయ్య, చెన్నగాని మట్టయ్య, మాజీ సర్పంచ్ ఆదూరి కోటయ్య, పద్మ, వార్డు మెంబర్ లు తదితరులు పాల్గొన్నారు.