ప్రైవేటీకరణను విరమించాలని సీపీఐ ధర్నా
దామరచర్ల, జూన్ 26 : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లోని యాష్ ప్లాంటు, కోల్ ప్లాంటు ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో మండలంలోని యాదాద్రి పవర్ ప్లాంట్ ఎదుట శుక్రవారం ఆందోళన నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బంటు వెంకటేశ్వర్లుమాట్లాడుతూ యాదాద్రి పవర్ ప్లాంట్ లోని స్టేజి 1,2 యూనిట్లకు సంబంధించి ఆపరేషన్, మెయింటెనెన్స్, మెకానికల్, ఎలక్ట్రిక్ పనులను ఉద్యోగుల కొరతను సాకుగా చూపిస్తూ యాష్ ప్లాంట్, కోల్ ప్లాంట్ లను రానున్న మూడు సంవత్సరాల కాలానికి గాను ప్రైవేట్ కాంట్రాక్టర్లు అప్పగించేందుకు టెండర్ల ను పిలిచ్చినట్లు చెప్పారు.తక్షణం టెండర్ల ను నిలిపివేయడం తోపాటు ,స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
లేదంటే ప్రజలందరినీ సమీకరించి పెద్ద ఎత్తున పోరాటాల నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి పోలేపల్లి ఉదయ్ కుమార్ సిపిఐ సీనియర్ నాయకులు జమ్ముల కోటయ్య, గజ్జల లక్ష్మి నరసింహ రెడ్డి, పెదపాక వెంకటేష్, పవన్ గాంధీ, కాశయ్య, రమేష్, సత్యానందం, సూర్యం మహేష్ బాబు, రాము, రవి నాయక్, కృపాకర్ తదితరులు పాల్గొన్నారు.






