నేరాల నియంత్రణే లక్ష్యం...
మీ సురక్ష మా భరోసా : ఏసీపీ వెంకట్ రెడ్డి
ఉప్పల్,(విజయక్రాంతి): నేరాల నియంత్రణ తమ లక్ష్యం అని ఉప్పల్ ఏసిపి వెంకట్ రెడ్డి అన్నారు. మీ సురక్ష కార్యక్రమంలో భాగంగా ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పల్ ఇన్స్పెక్టర్ రామలింగారెడ్డి ఆధ్వర్యంలో శ్రీనివాసపురం కాలనీలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు తమ కాలనీలో అపార్ట్మెంట్ ను నివసించే ప్రాంతాల్లో అనుమానాస్పదంగా వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ప్రజల సహకారంతోనే సమాజంలో శాంతి భద్రతలు కాపాడగలమని దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలని ఆయన పేర్కొన్నారు. ఇటీవల కాలంలో నేపాలి ముఠా కదలికలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండి ఇళ్లల్లో పనిచేసే కార్మికులు డ్రైవర్లు వాచ్మెన్ ల పట్ల జాగ్రత్త వహించాలని ఆయన కోరారు ఒంటరిగా నివసించే వృద్ధుల పూర్తి వివరాలు స్థానిక పోలీస్ స్టేషన్లో నమోదు చేయించుకోవాలని ఆయన సూచించారు. అనంతరం మీ సురక్ష పోర్టల్ ప్రాధాన్యతల గురించి ప్రజలకు వివరించారు.
డిజిటల్ ఆన్లైన్ పేమెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలియని వ్యక్తుల నుండి వచ్చే చరవాణి కాల్స్ పట్ల జాగ్రత్త వహించాలని ఆయన తెలిపారు. ఇంట్లోఉన్న వృద్ధులకు డిజిటల్ నేరాలపై అవగాహన కల్పించి అప్రమత్తంగా ఉండేలా ప్రతి ఒక్కరు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. యువత మారక ద్రవ్యాలకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తుకు అడుగులు వేయాలని యువతకు సూచించారు ఈ కార్యక్రమంలో ఉప్పల్ సబ్ ఇన్స్పెక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు.
నాచారంలో మల్కాజ్గిరి కమిషనర్ పరిధిలోని ప్రజల బాధ్యతను మరింత బలాదృతం చేయడానికి చేపడుతున్న సురక్ష కార్యక్రమంలో భాగంగా నాచారం డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ మాన్సింగ్ సబ్ ఇన్స్పెక్టర్ మైబల్లి ఆ దూరంలో నువ్వు రాఘవేంద్ర నగర్ లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆరక ద్రవ్యాలు మహిళా భద్రత ఆన్లైన్ మోసాలు నివారణపై కాలనీవాసులకు పలు సూచనలు చేశారు.






