30 July, 2026 | 8:43 PM

నల్లబండగూడెం సాయి మందిరంలో కొనసాగుతున్న గురుపౌర్ణమి వేడుకలు

30-07-2026 07:35 PM

కోదాడ,(విజయక్రాంతి): కోదాడ మండలంలోని నల్లబండగూడెం గ్రామంలో రామాపురం క్రాస్ రోడ్డులో ఉన్న షిర్డీ సాయి మందిరంలో గురుపౌర్ణమి వేడుకలు కొనసాగుతున్నాయి. గురువారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో హాజరై పూజలు, అభిషేకాల్లో పాల్గొన్నారు. దాతల సహకారంతో భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఆలయానికి సేవలు చేస్తున్న ఆలయ కమిటీ కోశాధికారి ఏదులాపురం శ్రీనివాస్‌ను సాయిమందిరం ఆవరణలో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అర్చకుడు సాయి శర్మ, గురుస్వామి శ్రీను, పూర్ణ, శ్యాం, నల్లపాటి ఆదినారాయణ, హేమంత్, సత్యనారాయణ, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.